15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీ జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు

- November 23, 2021 , by Maagulf
15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీ జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు

కువైట్: ఇన్వెస్టర్లు మరియు వ్యాపారవేత్తల కోసం 15 ఏళ్ళ వ్యవధితో రెసిడెన్సీని జారీ చేసేందుకు కువైట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు మరియు కమర్షియల్ ప్రాజెక్టుల యజమానులు, ఎంపిక చేసిన బిజినెస్ యూనిట్స్ సీఈవోలకు ఈ అవకాశం కల్పిస్తారు. రెసిడెన్సీ విధానం, వర్క్ పర్మిట్స్‌కిసంబంధించి స్పాన్సర్‌షిప్ అవసరం లేకుండా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయబోతోంది. ఎవరైతే వలసదారులు కువైట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారో అలాంటివారికి 15 ఏళ్ళపాటు స్టేట్ గ్యారంటీతో రెసిడెన్సీ కల్పించేందుకు ఈ కొత్త విధానం ద్వారా అవకాశం కలుగుతుంది. తద్వారా దేశంలో పెట్టబడులు పెరుగుతాయి. ఆర్థికంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com