ఇప్పట్లో ‘సిక్స్ మంత్స్ స్టే లిమిట్’ పునరుద్ధరణ లేనట్లే..!
- November 24, 2021కువైట్: కువైట్ వెలుపల ఉన్న ప్రవాసుల కోసం ఆరు నెలల రెసిడెన్సీ పరిమితిని తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన ఏదీ లేదని కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం తెలిపింది. ఆరు నెలలకు పైగా కువైట్ వెలుపల ఉన్నప్పటికీ, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉన్నట్లయితే, కువైట్ బయట ఉంటున్న వారికి రెసిడెన్సీ పునరుద్ధరించబడుతుందని పేర్కొంది. ఏదైనా కొత్త చట్టం అమలు, ఆరునెలల వ్యవధిలో బయట ఉండాలనే నిబంధనను పునరుద్ధరిస్తే వాటి అమలుకు తగినంత సమయం ఇవ్వబడుతుందని తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో కువైట్ ఆరు నెలల నియమాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం బయట ఉంటున్న ప్రవాసులు ఎవరైనా కువైట్ వెలుపల నుండి ఆన్లైన్లో వారి రెసిడెన్సీని పునరుద్ధరించుకోవడానికి అనుమతించామన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కువైట్‌ను విడిచిపెట్టిన ఆర్టికల్ 22 (ఫ్యామిలీ వీసా)ని కలిగి ఉన్న చాలా మంది కువైట్ బయటే ఉండిపోయారు. వారిలో చాలా మంది వ్యాక్సిన్లు తీసుకున్నా.. వాటిని కువైట్‌లో ఇంకా ఆమోదించలేదు. దీంతో చాలా మంది కువైట్‌కు తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అధికారులు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి