ఇప్పట్లో ‘సిక్స్ మంత్స్ స్టే లిమిట్’ పునరుద్ధరణ లేనట్లే..!

- November 24, 2021 , by Maagulf
ఇప్పట్లో ‘సిక్స్ మంత్స్ స్టే లిమిట్’ పునరుద్ధరణ లేనట్లే..!

కువైట్: కువైట్ వెలుపల ఉన్న ప్రవాసుల కోసం ఆరు నెలల రెసిడెన్సీ పరిమితిని తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన ఏదీ లేదని కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం తెలిపింది. ఆరు నెలలకు పైగా కువైట్ వెలుపల ఉన్నప్పటికీ, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉన్నట్లయితే, కువైట్ బయట ఉంటున్న వారికి రెసిడెన్సీ పునరుద్ధరించబడుతుందని పేర్కొంది. ఏదైనా కొత్త చట్టం అమలు, ఆరునెలల వ్యవధిలో బయట ఉండాలనే నిబంధనను పునరుద్ధరిస్తే వాటి అమలుకు తగినంత సమయం ఇవ్వబడుతుందని తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో కువైట్ ఆరు నెలల నియమాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం బయట ఉంటున్న ప్రవాసులు ఎవరైనా కువైట్ వెలుపల నుండి ఆన్‌లైన్‌లో వారి రెసిడెన్సీని పునరుద్ధరించుకోవడానికి అనుమతించామన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కువైట్‌ను విడిచిపెట్టిన ఆర్టికల్ 22 (ఫ్యామిలీ వీసా)ని కలిగి ఉన్న చాలా మంది కువైట్ బయటే ఉండిపోయారు. వారిలో చాలా మంది వ్యాక్సిన్‌లు తీసుకున్నా.. వాటిని కువైట్‌లో ఇంకా ఆమోదించలేదు. దీంతో చాలా మంది కువైట్‌కు తిరిగి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కువైట్ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అధికారులు తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com