‘స్లిమ్ గేమ్’ ప్రచారాలను ఆపండి: సీపీఏ
- November 24, 2021ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ మార్కెట్లో 'స్లిమ్ గేమ్' ప్రచారాన్ని కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్పత్తికి గల్ఫ్ కన్ఫర్మిటీ సర్టిఫికేట్ లేదా సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు ఉండాలని సీపీఏ స్పష్టం చేసింది. సుల్తానేట్ మార్కెట్లలో స్లిమ్ గేమ్‌ను సర్క్యులేట్ చేయడాన్ని ఆపివేయాలని ఉత్తర్వు నంబర్ లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి 50 నుంచి 1000 రియాల పెనాల్టీ విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. రెండోసారి కూడా ఇదే తప్పు రిపీట్ చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. రెండోసారికి మించి కూడా అలాగే ఉల్లంఘనలు చేసి వారికి రోజుకు 50 నుంచి 2000 రియాల ఫైన్ వేస్తామని ఆర్డర్స్ లో హెచ్చరించింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్