వరద సహాయక చర్యల్లో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు

- November 24, 2021 , by Maagulf
వరద సహాయక చర్యల్లో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు

వరద సహాయక చర్యల్లో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరద భీభత్సం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి గాల్లో వచ్చి గాల్లో వెళ్లిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే అన్నమయ్య రిజర్వాయర్, పింఛా నదులు కట్టలు తెంచుకున్నాయని విమర్శించారు.

చిత్తూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాపానాయుడుపేటలో వరద బాధితులను పరామర్శించారు. కుప్పంలో దొంగ ఓటర్లను దింపి టీడీపీని ఓడించారన్నారు చంద్రబాబు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుని, గౌరవ సభలో అడుగుపెడతానని చెప్పుకొచ్చారు.

తనను అసెంబ్లీలో మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో తన సతీమణి గురించి వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడటం బాధనిపించిందన్నారు. క్లైమోర్ మెన్స్‌కే భయపడలేదని వైసీపీ నేతలు ఒక లెక్క కాదని అన్నారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని, ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని సవాల్‌ విసిరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com