నోటి దుర్వాసన పోవడానికి చిట్కాలు
- November 26, 2021మనిషి ఎదురుకుంటున్న సమస్యల్లో నోటి దుర్వాసన అనేది ఒకటి.. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకున్న సరే ఈ సమస్య వెంటాడుతుంది. దుర్వాసన కారణంగా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేము. దీనిని దూరం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.. ఈ దుర్వాసన సమస్యను ఈజీగా వదిలించుకోవచ్చు. సాధారణంగా మనం పళ్ళని శుభ్రం చేసుకున్న 12 గంటలు తర్వాత పళ్ళ నుంచి దుర్వాసన రావడం అంటూ మొదలవుతుంది.
- ప్రతి 4, 5 గంటలకి మనం నోట్లో నీళ్లు పోసుకుని ఉమ్మేయాలి.
- నోటిని మరియి గొంతును పొడిగా ఉండటం వలన కూడా దుర్వాసన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది.
- నీరు ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల బ్యాక్టిరియా కూడా వృద్ధి చెందదు.
- ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోముకుంటే ఈ దుర్వాసనకి చెక్ పెట్టేయవచ్చు.
- ధూమపానం, మద్యపానం మానేయాలి.. నోటిలో చాలా గంటలపాటు ఉంటుంది. తద్వారా నోటినుంచి దుర్వాసన వస్తుంది.
- తులసి, పుదీనా వంటివి రోజువారి ఆహారంలో తీసుకుంటే ఈ నోటి దుర్వాసనకి చెక్ పెట్టేయవచ్చు.
- సోంపుచక్కటి మౌత్ ఫ్రెషెనర్‌గా పని చేసి నోటి దుర్వాసనను అరికడుతుంది.
- పెరుగు తినడం, గ్రీన్ టీ తాగడం ద్వారా కూడా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం