డిజిటల్ లైసెన్స్ ఉన్న సరే వర్జినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే
- November 26, 2021
కువైట్: కువైట్ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైెసెన్స్ ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాదారులు డిజిటల్ డ్రైవింగ్ లెసెన్స్ ఉన్నప్పటికీ వర్జినల్ లైసెన్స్ ను డ్రైవింగ్ చేసేప్పుడు క్యారీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.డిజిటల్ లైసెన్స్ ను యాక్సెప్ట్ చేయాలని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలే కువైట్ మొబైల్ ఐడీ యాప్ ను డ్రైవింగ్ లైెసెన్స్ లను అనుసంధానం చేసి డిజిటలైజేషన్ చేశారు.దీంతో చాలా మంది వాహనాదారులు ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని అడిగితే మొబైల్ యాప్ నుంచి డిజిటల్ లైసెన్స్ ను చూపిస్తున్నారు. ఐతే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇది ట్రాఫిక్ నిబంధనల వాయిలేషనేనని స్పష్టం చేశారు. డిజిటల్ లైసెన్స్ చూపించి..వర్జినల్ లైసెన్స్ చూపించని చాలా మందిపై ఫైన్స్ కూడా వేశారు. ఈ విషయంపై వాహనాదారుల్లో గందరగోళం నెలకొనటంతో ట్రాఫిక్ విభాగం అధికారులు క్లారిటీ ఇచ్చారు.డిజిటల్ లైసెన్స్ ఉన్న సరే వర్జినల్ లైసెన్స్ ను క్యారీ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..