కొత్త వీసాల జారీ ప్రక్రియ ఆన్ లైన్ లో...మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి
- November 27, 2021![1 కొత్త వీసాల జారీ ప్రక్రియ ఆన్ లైన్ లో...మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి](https://www.maagulf.com/godata/articles/202111/VISA_1637991762.jpg)
కువైట్:వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్ )తెలిపింది. వర్క్ పర్మిట్ కు సంబంధించిన వీసాలను త్వరలోనే ఆన్ లైన్ లో జారీ చేస్తామని ప్రకటించింది. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకోవటానికి జనాలు ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన (పీఏఎమ్) అధికారులు ఆన్ లైన్ లో వీసాల జారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇది అమల్లోకి రావచ్చని అధికారులు తెలిపారు. వర్క్ వీసాలను ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి బదిలీ చేయటం, ఫ్యామిలీ వీసా నుంచి కంపెనీ వీసా మార్చుకోవటం, స్టూడెంట్ వీసాను వర్క్ పర్మిట్ వీసా మార్చుకునేందుకు కూడా ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే చాలా మంది ప్రవాసులకు మేలు జరగనుంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక
- నర్సింగ్ సిబ్బందిని అభినందించిన నర్సింగ్ డైరెక్టర్
- యూఏఈలో కొత్త లోన్ స్కామర్లు, నకిలీ వాట్సాప్ జాబ్స్ ఫ్రాడ్స్..!
- ఇజ్రాయెల్ పై చర్య తీసుకోవాలి.. సౌదీ క్రౌన్ ప్రిన్స్
- అబుదాబిలో పార్కింగ్ నిబంధనలు కఠినతరం
- రిటైల్ రియాల్టీ మార్కెట్లో గణనీయమైన వృద్ధి..!
- మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖలో 110 సేవలు డిజిటలైజేషన్
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది సంబరాలు
- ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం