శంషాబాద్ విమానాశ్రయంలో ఆంక్ష‌లు...

- November 28, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో ఆంక్ష‌లు...

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్ష‌లు విధించారు.ద‌క్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో శంషాబాద్ విమానాశ్రయం అప్ర‌మ‌త్తం అయింది.వివిధ దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించింది.హైద‌రాబాద్ విమానాశ్రయంకు వ‌చ్చే ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.అదీ 72 గంట‌ల ముందు చేయించుకున్న‌దై ఉండాలి.విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ప్ర‌యాణికుల‌కు మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.  

ఈ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ వ‌స్తే హోంక్వారంటైన్ లేదా ఆసుప‌త్రిలో చేరాలి.ప్రయాణికుల ప‌రీక్ష‌ల కోసం విమానాశ్రయంలో మ‌రో రెండు కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, న‌మీబియా, బోట్స్‌వానా, ఇజ్రాయిల్‌, హాంకాంగ్‌, బెల్జియం నుంచి వచ్చే ప్ర‌యాణికుల‌కు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల‌ని ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com