యూఏఈ లో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం కంప్లీట్
- November 29, 2021
యూఏఈ : కరోనా వ్యాక్సినేషన్ లో యూఏఈ సూపర్ సక్సెస్ ను సాధించింది. దేశంలో దాదాపుగా 100 శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తి చేసింది. దీని అర్థం అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు కాదని యూఏఈ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసని తెలిపారు. రెండో డోసు పూర్తైతేనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయినట్లు చెప్పారు. ఐతే ఒక్క డోస్ మాత్రం 100 శాతం ప్రజలకు ఇవ్వగలిగామని అన్నారు. దీంతో కరోనా రిస్క్ ను చాలా వరకు తగ్గించినట్లైందన్నారు. అటు వర్క్ వీసా మీద దేశానికి వచ్చే ప్రవాసులకు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైతేనే అనుతించాలని విదేశీ మంత్రిత్వశాఖ అధికారులను డాక్టర్ అల్ హోసని కోరారు. వీలైనంత త్వరగా దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తి చేస్తామన్నారు. మూడేళ్లు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







