వృద్ధాశ్రమంలో కరోనా కలకలం..67 మందికి నిర్ధారణ
- November 29, 2021
ముంబై: మహారాష్ట్ర థానేలోని ఒక వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేగింది. ఏకంగా ఆశ్రమంలోని 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.
వీరిలో ఐదుగురు వృద్ధాశ్రమ సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని అన్నారు. ఆశ్రమంలో ఉంటున్న ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో శనివారం భివాండి జిల్లా సొర్గావ్ గ్రామంలోని మాతోశ్రీ వృద్ధాశ్రమాన్ని సందర్శించినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. ఇక్కడ ఉన్న 109 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. దాంతో ఆశ్రమంలోని 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని తెలిసింది. వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
మొత్తం 1,130 మంది జనాభా ఉన్న సొర్గావ్ గ్రామాన్ని ఈ మేరకు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. థానే జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన క్లస్టర్లలో అతి పెద్ద క్లస్టర్ ఇదేనని అన్నారు. 15 మంది శాంపిల్స్‌ను జినోమ్ స్వీక్వెన్సింగ్ కోసం పంపామని డా.కైలాష్ పవార్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







