ట్విట్టర్‌లో అవమానపర్చినందుకు 250,000 దిర్హామ్‌ల జరీమానా

- March 22, 2016 , by Maagulf
ట్విట్టర్‌లో అవమానపర్చినందుకు 250,000 దిర్హామ్‌ల జరీమానా

అబదాబీ మిస్డెమీనర్‌ కోర్ట్‌, స్పోర్ట్‌ క్లబ్‌ ఫ్యాన్‌ మరో క్లబ్‌ని సోషల్‌ మీడియా ద్వారా అవమానపర్చినందుకుగాను 250,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. అబుదాబీలోని సదరు స్పోర్ట్స్‌ క్లబ్‌ మేనేజ్‌మెంట్‌ లాసూట్‌ని వేయడంతో, విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ (ట్విట్టర్‌ ద్వారా) నిందారోపణలు చేసి, అవమానించినవారిపై చర్యలు తీసుకుంది. ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. స్పోర్ట్స్‌ క్లబ్‌పై ఆరోపణలు చేయడమే కాకుండా, అందులోని వ్యక్తుల పట్ల కూడా విమర్శనాత్మకంగా ట్విట్టర్‌లో వ్యాఖ్యాలను పొందుపర్చాడు నిందితుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com