జన్మభూమి నా దేశం కర్మభూమి ఈ దేశం

- December 01, 2021 , by Maagulf
జన్మభూమి నా దేశం కర్మభూమి ఈ దేశం

అతి పెద్ద రాజ్యంగంతో డబ్భై ఐదు వసంతాల ఆజాదీకా మహోత్సవాల వేడుకలతో అపురూపమైన భరతఖండం

అన్నదాతలతో దేశరక్షణే ఊపిరిగా కదనరంగంలో
నిలిచిన వీరజవాన్ల వేదభూమి నా దేశం.
శాంతి సహనం సౌభ్రాతృత్వం విభిన్నమతాల 
సంస్కృతి సంప్రదాయాలు బహుభాషల 
సమ్మేళనంతో ఆధిపత్యంకి  ఆరాటపడని
ఐకమత్త్యంతో స్వేచ్ఛకి మారుపేరైన మైత్రేయి దేశం
సమతా ప్రేమానునురాగాల సకలసౌభాగ్యాలతో
ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రజలని సంరక్షించే దేశం.
అధునాతన పరికరాలతో రవాణ వాణిజ్యరంగంలో
తనదైన శైలిలో నిత్యనూతనంగా ప్రపంచదేశాల 
జాబితాలో ఐదవ స్థానం దక్కించుకున్న అందమైన
ఉద్యానవనాలు సుందరదృశ్యాలతో పర్యాటకులని
ఆకర్షించే అధ్భుతమైన కళలకాణాచి ఎత్తెన హర్మియాలతో
విశ్వంలోనే అత్యంత ఖరీదు ఎత్తెన అబ్బురపరిచే ఖలీఫా అందాలు,అలలు నడుమ బుర్జ్ అల్ అరబ్ సుందరమైన కట్టడం అడుగడునా గోచరించే తెలుగోడి మేధోశక్తి 
పసిడికి పేరెన్నికగన్న అందమైన ఒయాసిస్ అందాలతో 
ప్రకృతిని తలపించే పూలఉద్యానవనం పచ్చని చెట్లు 
చూపరులు మెచ్చే సొగసులు స్వర్గాన్ని తలపించే అందాలు
రహదారుల కిరువైపుల ఖర్జూరపు చెట్లు ఇసుకదిబ్బలు
నీటిబుగ్గలు చిన్నారుల మదినిదోచే ఫెరారిప్రపంచం
తెల్లనిపాలరాయితో నిర్మితమైన అత్యధ్బుత కట్టడం
ప్రశాంతతకి నిలయం అతి పెద్ద ప్రార్థనామందిరం 
దేశప్రజల శ్రేయస్సు కోసం భరోసా కల్పిస్తు సరిహద్దుల్లో 
ప్రహర కాచే జవాన్ కి అభివాదం 
రెపరెపలాడుతూ ఎగురుతున్న స్వతంత్ర భావాల జెండాకి
గుండెలనిండా దేశభక్తిని నింపుకొని గౌరవంగా చేస్తున్నాం 
వందనం. 

గత రెండు సంవత్సరాలుగా యావత్ మానవాళిని అతలాకుతలం చేసిన విషపురుగు విస్తరించకుండా సత్వరం  స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఈ దేశ కార్య నిర్వాహకుల సేవ ఎంత చెప్పినా తక్కువే అందరికి  సకాలంలో టీకాని అందించిన వైద్యుల అజరామర సేవలు కొనియాడతగింది చేయాలి వారికి చేతులెత్తి వందనం. 

నూనె నిక్షేపాలు సుగంధ ద్రవ్యాలతో అరబిక్ కదలందాలు 
తాటి తరువులతో తన్మయపరచే అనుభూతులు 
ఆరోగ్యభధ్రతల్ని కల్పించి ఘనతను చాటుకున్న దేశం 
తారతమ్యాలు విడచి స్నేహసోరభాలు కోరుకునే దేశం
చారిత్రాత్మక వైఙ్ఞానిక సంగ్రహలయం అంతర్జాతీయ 
ప్రదర్శనతో యావత్ మానవాళిని కనువిందు చేస్తున్న
ఒకటా రెండా ఇలా ఎన్నో అందాలతో కళకళలాడే దేశం. 

ప్రతి యేటా కనులు మిరుమిట్లు గొలిపే రంగురంగుల  విద్యుద్దీప కాంతులతో వైభవంగా జరుపుకొనే దేశం యొక్క వారోత్సవాలు ఈయేడు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న ఐక్యఎమరాతి దేశాల అరబీయుల రాజధాని అబుదాభి దేశం నింపింది అందరి హృదిలో ఆనందాల హేల అంగరంగవైభవంగా ఓ పక్క అందంగా ముస్తాబైన వినువీధులు చూపరుల కనులకి ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే చిరుదివ్వెల కాంతులు ,ఈ వేడుకలని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్న అమెరికా దేశం . తెలుగువారినందరిని ఏకం చేసిన తెలుగు సంఘాలు తెలుగు లోగిళ్ళలో అమ్మ భాష ని విశ్వవ్యాప్తం చేస్తు తెలుగు వెలుగులు విరజిమ్ముతున్న తెలుగు వారు. 

నేను మరియు ప్రతి ఒక్క భారతీయులు ఈ దేశానికి వందనమర్పిస్తు మన దేశాన్ని గౌరవిద్దాం ఈ దేశ ప్రగతికి తోడ్ఫడుదాం. 

--యామిని కొళ్లూరు(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com