కె-నెట్ ఔట్లెట్ల ద్వారా 2021 తొలి పది నెలల్లో 18 బిలియన్ KD లావాదేవీ
- December 01, 2021
కువైట్: కువైట్‌లో నివాసితులు అలాగే పౌరులు 18 బిలియన్ కువైటీ దినార్లను కె-నెట్ ఔట్లెట్ల ద్వారా 2021 తొలి పది నెలల్లో వెచ్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 9.5 బిలియన్ కువైటీ దినార్లను పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల ద్వారా, 8.5 బిలియన్ కువైటీ దినార్లు ఎలక్ట్రానిక్ విధానంలోనూ ఏటీఎం ద్వారా (నగదు తీసుకోవడం) చేసినట్లు షేర్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కంపెనీ (కె-నెట్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దలాల్ అల్ యాకూత్ వెల్లడించారు. మొత్తం పేమెంట్ లావాదేవీల మొత్తం 420 మిలియన్లుగా వుంది. ఇందులో 282 మిలియన్ల పేమెంట్ లావాదేవీలు పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల ద్వారా జరిగితే, 138 మిలియన్ లావాదేవీలు ఎలక్ట్రానిక్ చెల్లింపులు, ఏటీఎం విత్‌డ్రాలు వున్నాయి. 940,000 పైగా కార్యకలాపాలు సగటున రోజూ జరిగాయి. సగటున నెలకి 28.2 మిలియన్ లావాదేవీలు జరిగాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







