యూఏఈలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

- December 02, 2021 , by Maagulf
యూఏఈలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

యూఏఈ: ప్రపంచాన్ని కలవర పెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ యూఏఈలోకి వచ్చేసింది. ఓ ఆఫ్రికా మహిళలో ఒమిక్రాన్ వైరస్ ను గుర్తించినట్లు ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్(మోహాప్) ట్విట్టర్‌లో తెలిపింది. సదరు మహిళ యూఏఈ నుంచి వెళుతోందని, నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం.. కొవిడ్-19 రెండు డోసుల వ్యాక్సిన్ పొందిందని స్పష్టం చేసింది. మహిళలో ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంచి ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మోహప్ చెప్పింది. ఆమెతో కాంటాక్ట్ లో ఉన్న వారిని కూడా ఐసోలేట్ చేశామని చెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com