విదేశీ కార్మికుల రిక్రూట్ మెంట్ లో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు

- December 02, 2021 , by Maagulf
విదేశీ కార్మికుల రిక్రూట్ మెంట్ లో ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు

సౌదీ: చట్టవిరుద్ధంగా విదేశీ కార్మికులను రిక్రూట్ చేసుకున్న కంపెనీలు, దుకాణాల ఓనర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని  జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) తెలిపింది.లేబర్, రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘిస్తే  వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే సౌదీ రియాల్ 1,00,000 ఫైన్ వేయడంతోపాటు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. డిఫాల్ట్ చేసిన సంస్థలు ఐదేళ్ల వరకు ఫారిన్ ఎంప్లాయిస్ ను రిక్రూట్ చేసుకోకుండా నిషేధిస్తామని తెలిపింది.  రెసిడెన్సీ, లేబర్ అండ్  బార్డర్ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని తెలుపాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మక్కా,రియాద్ ప్రాంతాలలో ఐతే 911 నంబర్‌కు.. ఇతర ప్రాంతాలలో వారు  999 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com