వ్యాక్సిన్ వేసుకోకపోతే శాలరీ కట్..
- December 03, 2021
తమిళనాడు: కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. వైరస్ బారిన పడకుండా ఉండండి అని ఎంత మొత్తుకున్నా వినట్లేదని ఉద్యోగులకు డిసెంబర్ నెల జీతాలు ఇవ్వనంటోంది మధురై విద్యుత్ బోర్డు. చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన సర్క్యులర్ చూసి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే 75 శాతానికి పైగా విద్యుత్ శాఖ ఉద్యోగులు రెండు డోసుల టీకాలు వేసుకున్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతున్న తరుణంలో ఇంజనీర్ ఉద్యోగుల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతో బోర్డు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందారు. ఇంజనీర్ చర్యను విమర్శిస్తున్నారు. దీంతో దిగి వచ్చిన చీఫ్ ఇంజనీర్ ఉమాదేవి డిసెంబర్ నెల జీతాలు ఉద్యోగులు అందజేస్తాం అని హామీ ఇచ్చారు. జీతం కట్ చేస్తామంటే ఉద్యోగులు అందరూ వ్యాక్సిన్ లు వేయించుకుంటారనే ఉద్దేశంతో ఆ విధమైన ప్రకటన చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.
తాజా వార్తలు
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!







