వ్యాక్సిన్‌ తీసుకుంటే ఒమిక్రాన్ ఏమీ చేయదన్న బయోఎన్‌టెక్ సంస్ధ

- December 04, 2021 , by Maagulf
వ్యాక్సిన్‌ తీసుకుంటే ఒమిక్రాన్ ఏమీ చేయదన్న బయోఎన్‌టెక్ సంస్ధ

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ  క్రమంలో  జర్మనీలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోఎన్‌టెక్‌ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ సోకినా తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉండవని చెప్పింది.అందుకే ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని, వ్యాక్సిన్లపై అపోహాలు లేకుండా అందరూ టీకా తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ మరిన్ని మ్యూటేషన్లు పొందే అవకాశాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేమంది. అయితే వైరస్ లోని మ్యూటేషన్లు కాలానుగుణంగా మార్పులు చెంది సాధారణ ఫ్లూ మాదిరిగా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని... అప్పుడు ఏటా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరముంటుందని బయోఎన్ టెక్ అభిప్రాయపడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com