ఒమిక్రాన్ తలనొప్పి.. రైల్వేస్టేషన్‌ను తలపించిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు
- December 06, 2021
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఒమిక్రాన్ భయంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన నిబంధనలు తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరుగుతోంది. ఫలితంగా కరోనా నిబంధనలు గాలికొదిలే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో పరీక్షలు చేయించుకుని ఫలితం తెలుసుకునే వరకు ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులకు అక్కడి అధికారులు రెండు అవకాశాలు కల్పించారు. ఒకటి.. సాధారణ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష. దీనికి రూ.500 వసూలు చేస్తున్నారు. ఈ పరీక్ష ఫలితం రావాలంటే ప్రయాణికులు 6-8 గంటలు ఎదురుచూడాల్సి వస్తుంది. ఇక రెండోది.. ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్. దీని ధర రూ.3,500. రెండు గంటల్లో ఫలితం వస్తుంది. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ఫలితానికి చాలా సేపు పడుతుండటంతో ఖర్చు ఎక్కువైనా ప్రయాణికులు ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే దీని ఫలితం కోసం కూడా రెండు గంటల సమయం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ డెస్కుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక, పరీక్షల కోసం పెద్ద పెద్ద క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదివారం నాటి దృశ్యాలను కొందరు ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కరోనా నిబంధనలు పక్కనబెడితే.. ఈ పరిస్థితులతో ఎయిర్‌పోర్టులే హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ప్రయాణికులు కనీస నిబంధనలైన మాస్క్‌లు, భౌతిక దూరాన్ని పాటించకపోవడం కలవరపెడుతోంది. ఈ నిబంధనలు ఒమిక్రాన్ కట్టడికా? ఆహ్వానానికా? అన్నట్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రయాణికులకు వైరస్ పరీక్షల కోసం దిల్లీ ఎయిర్‌పోర్టులో కొత్తగా 20 కౌంటర్లను తెరిచినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







