మళ్ళీ తెరపై కనిపించనున్న'కమెడియన్ సుధాకర్'
- June 08, 2015
ఒకప్పుడు సుధాకర్ తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూసేవి... అంతకు ముందు సుధాకర్ పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు... అంతకంటే ముందు తమిళనాట యంగ్ హీరోగా వరుస విజయాలతో సంచలనం సృష్టించారు సుధాకర్... తమిళనాట స్టార్ డమ్ వదలుకొని మాతృభాషపై మమకారంతో తెలుగులో హాస్య పాత్రలను సైతం ఆనందంగా అంగీకరించి అభినయించారు సుధాకర్.. అలాంటి సుధాకర్ కొన్నేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నారు... ఆయన ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అంటూ ఏబీయన్ -ఆంధ్రజ్యోతిని కూడా అభిమానులు అడిగేవారు... మొన్న సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏబీయన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ తాను నటిస్తున్నానని చెప్పారు... చెప్పినట్టుగానే సుధాకర్ 'వాడు నేను కాదు' అనే చిత్రంలో నటిస్తున్నారు... దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న 'వాడు నేను కాదు' చిత్రంలో సుధాకర్ నటిస్తున్నారు... ఇది తప్పకుండా ఆయన అభిమానులకు ఆనందం పంచే విషయమే... సుధాకర్ మళ్ళీ మునుపటిలా హాస్యంతో అలరిస్తారని ఈ స్టిల్ చూసిన వారు ఆశిస్తున్నారు... 'వాడు నేను కాదు' చిత్రం విడుదలయ్యాక సుధాకర్ మరిన్ని చిత్రాల్లో తనదైన బాణీ పలికిస్తారేమో చూడాలి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







