‘కలాం’ కొత్త సొల్యూషన్
- June 08, 2015
కలాం టెలికాం ఇండస్ట్రీ సిగ్మెంట్స్ కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.బ్యాంకింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, పర్యాటకం, ఎడ్యుకేషన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు సంబంధించిన సంస్థలకు అవసరమైన మేర సేవల్ని అందిస్తున్న కలాం టెలికాం, తమ సేవలకు కొత్త కొత్త టెక్నాలజీని జోడిరచి, వినియోగదారులకు మరిన్ని సేవల్ని అందించడానికి సిద్ధంగా వున్నట్లు వెల్లఇంచింది.ఆయా సంస్థల అవసరాలకు సంబంధించి తాము ఓ సర్వే నిర్వహించామనీ, ఆ సర్వేలో వెల్లడయిన అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, కమ్యూనికేషన్ అవసరాలన్నిటికీ ఒకే చోట పరిష్కారం లభించేలా తీసుకొస్తున్న కొత్త విధానం, తమ కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు కలాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీర్ పస్సి. ఫోర్బ్స్ యూఏఈలోని మిడిల్ ఈస్ట్ టాప్ 500 కంపెనీల లిస్ట్‌లోని పలు టాప్ ర్యాంకింగ్ కంపెనీలు తమ కస్టమర్లేనని వీర్ పస్సి చెప్పారు. డాటా, వాయిస్, ఇంటర్నెట్, ఐసీటీ మరియు క్లౌడ్ కనెక్టివిటీ ఇలా అన్ని రకాలైన కమ్యూనికేషన్‌ని కలాం టెలికామ్ సమర్థవంతంగా నిర్వహిస్తూ కస్టమర్ల మన్ననల్ని అందుకుంటోంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







