కువైట్ లో అవినీతి నిర్మూలనకు మరిన్ని చర్యలు...
- December 08, 2021
కువైట్: దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ను మరింత బలోపేతం చేయనుంది. ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నజాహా చైర్మన్, అబ్దుల్ అజీజ్ అల్-ఇబ్రహీం తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా UN కన్వెన్షన్, అరబ్ అవినీతి వ్యతిరేక సదస్సులో కువైట్ చేరడంతోనే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. పాలస్తీనా అవినీతి నిరోధక అథారిటీ మూడవ అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి చట్టాల రూపకల్పనకు నజాహా కృషి చేసిందన్నారు. ఆడిటింగ్ మోసాలు, పబ్లిక్ టెండర్లలో మోసాలను కనిపెట్టేందుకు సెంట్రల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడంతోపాటు పాలనలో పారదర్శకతకు నజాహా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థిరమైన అభివృద్ధి 2030 లక్ష్యాలను సాధించే ప్రయత్నాలలో నజాహా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







