కువైట్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

- December 08, 2021 , by Maagulf
కువైట్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

కువైట్ సిటీ:కువైట్ లో ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు నమోదయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఒమిక్రాన్ కేసు ఆఫ్రికన్ దేశాల్లో నుండి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ నమోదైందని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ తెలిపారు.ప్రయాణికుడు కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు మోతాదులను గతంలో తీసుకున్నాడు మరియు ఇప్పుడు అతను ఆరోగ్య ప్రోటోకాల్‌ల ప్రకారం  క్వారైంటేన్ లో ఉన్నాడని అల్-సనద్ ధృవీకరించారు.అనేక దేశాలు కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రకటించడంతో మంత్రిత్వ శాఖ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం, కువైట్‌లో మహమ్మారి పరిస్థితి స్థిరంగా ఉందని అయినప్పటికీ, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మంత్రిత్వ శాఖకు సహాయపడటానికి పౌరులు & నివాసితులు బూస్టర్ వ్యాక్సిన్ షాట్ తీసుకోవాలని సూచించారు.కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాలు చూపించాయని ఆయన తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com