కువైట్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
- December 08, 2021
కువైట్ సిటీ:కువైట్ లో ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు నమోదయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఒమిక్రాన్ కేసు ఆఫ్రికన్ దేశాల్లో నుండి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ నమోదైందని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ తెలిపారు.ప్రయాణికుడు కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు మోతాదులను గతంలో తీసుకున్నాడు మరియు ఇప్పుడు అతను ఆరోగ్య ప్రోటోకాల్‌ల ప్రకారం క్వారైంటేన్ లో ఉన్నాడని అల్-సనద్ ధృవీకరించారు.అనేక దేశాలు కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రకటించడంతో మంత్రిత్వ శాఖ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం, కువైట్‌లో మహమ్మారి పరిస్థితి స్థిరంగా ఉందని అయినప్పటికీ, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మంత్రిత్వ శాఖకు సహాయపడటానికి పౌరులు & నివాసితులు బూస్టర్ వ్యాక్సిన్ షాట్ తీసుకోవాలని సూచించారు.కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాలు చూపించాయని ఆయన తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం