భవిష్యత్తులో సాధించే వాటిపై దృష్టి పెట్టండి:షేక్ మహమ్మద్

- December 11, 2021 , by Maagulf
భవిష్యత్తులో సాధించే వాటిపై దృష్టి పెట్టండి:షేక్ మహమ్మద్

యూఏఈ: గత విజయాలు కాకుండా భవిష్యత్తులో యూఏఈ ఏమి సాధిస్తుందనే దానిపై దృష్టి పెట్టండని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. యూఏఈకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హట్టాలో అధికారిక స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ పాలకుడు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటనను విడుదల చేశారు. ‘ఫ్లాషెస్ ఆఫ్ లీడర్‌షిప్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. షేక్ మహమ్మద్ తన ప్రసంగంలో పిరమిడ్లను ఉదహరణగా చెప్పారు.  పురాతన ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు.. 5,000 సంవత్సరాల తర్వాత కూడా నిలబడి ఉంటాయని వారు ఊహించి ఉండరని అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com