ఇజ్రాయెల్ మాజీ ప్రధానికి బహుమతిగా భగవద్గీత ఇచ్చిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్
- December 11, 2021
జెరూసలేం: ఇజ్రాయెల్ లో జరగననున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ ఊర్వశి రౌతేలా. ఇండియా నుంచి ఈ ఈవెంట్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన వారిలో అతి చిన్న వయస్కురాలు ఈ బ్యూటీ కావడం విశేషం. 2021 డిసెంబర్ 12న ఇజ్రాయెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక మిస్ ఇండియా పోటీల కోసం తాజాగా ఇజ్రాయెల్ చేరుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో ఊర్వశి ఆయన నివాసంలో బెంజమిన్ తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా కలిసి బహుమతిగా భగవద్గీతను అందించారు. అంతేకాదు మాజీ ప్రధానికి ‘సబ్ షాందర్ సబ్ బదియా’ అనే కొన్ని హిందీ పదాలను కూడా నేర్పింది.
ఈ వీడియోను ఊర్వశి తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ “ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి, తెలివైన బెంజమిన్ నెతన్యాహు కూడా తనను మిస్ యూనివర్స్ ఈవెంట్‌కు ఆహ్వానించారు” అంతో ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.ఊర్వశి రౌతేలా ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ అవినాష్ మిశ్రా నిజ జీవిత భార్య పూనమ్ మిశ్రాగా కనిపించనుంది. ఆమె తెలుగులో “బ్లాక్ రోజ్”తో సహా మరికొన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో కూడా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!