‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్...
- December 13, 2021
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా ముందు ఆయన సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులు అర్పించారు.
సుకుమార్ సినిమాలన్నింటిలో ప్రత్యేకంగా ఆకర్షించే ఐటెమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక “పుష్ప”లో కూడా సమంతతో ఈ ఐటమ్ సాంగ్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ పాట గురించి చంద్రబోస్ మాట్లాడుతూ ‘సంగీత స్వరకల్పన చరిత్రలో ఈ సాంగ్ ఓ రికార్డు’ అని వెల్లడించారు. “దేవిశ్రీ ప్రసాద్ 4 మ్యూజికల్ నోట్స్ తో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ సాంగ్ కంపోజ్ చేశాడు. చరిత్రలో ఎవరూ అలా చేయలేదు. ఇంతకుముందు ఇళయరాజా 3 మ్యూజికల్ నోట్స్‌తో ఓ పాటను కంపోజ్ చేయగా, ఇప్పుడు డీఎస్పీ 4 నోట్స్‌తో ‘ఊ అంటావా’ సాంగ్ ను క్రియేట్ చేశాడు” అని తెలియజేశారు చంద్రబోస్.
తాజా వార్తలు
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్‌లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్‌లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన









