ఏపీ హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి భూమిపూజ
- December 13, 2021
అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సోమవారం భూమి పూజ చేశారు. అమరావతి నేలపాడు లోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రాంగణానికి ఎదురుగాఉన్న 3 ఎకరాల విస్తీర్ణంలో రూ.33.50 కోట్ల అంచనా వ్యయంతో జి+3 భవన సముదాయం నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించబోయేది జి+3 భవన సముదాయం అయినప్పటికీ జి+5 పూనాది రూపకల్పనతో దీన్ని నిర్మించడం విశేషం. గ్రౌండ్ ఫ్లోర్ తోపాటు మరో మూడు అంత్తసుల్లో నిర్మించనున్న ఈ భవన సముదాయ నిర్మాణం నిర్థేశించిన లక్ష్యం మేరకు రానున్న ఆరు మాసాల్లో పూర్తయితే హైకోర్టుకు అదనంగా సుమారు 76 వేల 300 చ.అ. వసతి సమకూరుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో లైబ్రరీ, రికార్డు రూము, 2 ఫ్లక్సిబుల్ కార్యాలయ స్థలాలు, మొదటి, రెండు అంతస్తులో ఒక్కొక్క అంతస్తులో 6 కోర్టు హాల్స్ చొప్పున మొత్తం 12 కోర్టు హాల్స్, మరియు మూడో అంతస్తులో 2 కోర్టు హాల్స్ తో పాటు న్యాయమూర్తుల సమావేశ మందిరం, 3 ఆఫీస్ ఛాంబర్లు, కార్యాలయ స్థలం వసతి సమకూర్చుకొనేందుకు హైకోర్టుకు అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా సుమారు 60 వాహనాలను నిలుపుకునేందుకు అనువుగా పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మీ, సెక్రటరీ రామ్ మనోహర్, సి.ఆర్.డి.ఏ. కమిషనర్ విజయకృష్ణన్ తదితరులతో పాటు పలువురు న్యాయాధికారులు, జి.పి.లు, అడ్వకేట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









