మరో సంచలన ప్రయోగానికి సిద్దమైన ఎలన్ మస్క్..!
- December 14, 2021
ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ తన క్రేజీ చేష్టలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఒక్కోసారి తను చేసే ట్విట్స్తో అందరినీ షాక్‌కి గురి చేస్తారు..
మరికొన్ని ట్విట్స్తో ఎంటర్టైన్ చేస్తారు. తాజాగా మరోసారి, ఎలన్ మస్క్ ఆసక్తికరమైన ఒక ట్వీట్ చేశారు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ట్వీట్లో ఇలా పేర్కొన్నారు.. "స్పేస్ ఎక్స్ వాతావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు తీసి రాకెట్ ఇంధనంగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉంటే దయచేసి చేరండి. అంగారక గ్రహానికి కూడా ఇది ముఖ్యం" అని మస్క్ ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ "2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికచేయబడ్డారు. అంతరిక్ష రవాణా ఖర్చులను తగ్గించి, అంగారక గ్రహాన్ని నివాస యోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు. మనుషులను అంతరిక్షంలోకి తసుకెళ్లడానికి స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌకను కూడా తయారు చేస్తోంది. అది అంగారక గ్రహం మీద స్థిరపడే ప్రక్రియను ప్రారంభిస్తుంది. స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌక 100 మెట్రిక్ టన్నులకు పైగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
SpaceX is starting a program to take CO2 out of atmosphere & turn it into rocket fuel. Please join if interested.
— Elon Musk (@elonmusk) December 13, 2021
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









