‘కొండా’ నుండి ‘భలే భలే’ సాంగ్ విడుదల చేసిన ఆర్జీవీ!

- December 14, 2021 , by Maagulf
‘కొండా’ నుండి ‘భలే భలే’ సాంగ్ విడుదల చేసిన ఆర్జీవీ!

హైదరాబాద్: తెలంగాణ రక్త చరిత్రను ‘కొండా’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొంతకాలం నక్సలిజం నీడలో గడిపి, ఆపైన రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజానాయకుడిగా ఎదిగిన కొండా మురళీ జీవన ప్రయాణం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదిత్ అరుణ్, ఇరా మోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కొండా’ షూటింగ్ ను కొద్ది రోజుల క్రితం వరంగల్ లో మొదలు పెట్టారు.

అయితే ఊహించని ఇబ్బందుల కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ చేయలేకపోయామని, కొంత భాగం బయట చిత్రీకరించిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో వరంగల్ లోనే షూటింగ్ చేస్తున్నామని వర్మ చెప్పారు.ఈ సినిమా కోసం ప్రముఖ సినీ రచయిత సిరాశ్రీ రాసిన ‘భలే భలే’ అనే విప్లవ గీతాన్ని వరంగల్ గద్దర్ తో కలిసి వర్మ పాడారు. దానిని మంగళవారం విడుదల చేశారు. తెలంగాణలో నిజ జీవిత సంఘటల ఆధారంగా జరిగిన ఈ సాయుధ పోరాట కథను కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com