పేలిన పెట్రోల్ ట్యాంకర్..50 మంది మృతి
- December 14, 2021
కేప్ హైతియాన్: కరేబియన్ దీవి హైతీలో ఘోరప్రమాదం సంభవించింది.కేప్ హైతియాన్‌లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలింది.ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి.దాదాపు 20 కి పైగా ఇళ్లు మంటల్లో చిక్కుకున్నట్టు స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ పేర్కొన్నారు. మృతుల సంఖ్యను ఇప్పుడే అంచనా వేసి చెప్పలేమని, ఇళ్లల్లో ఉండి మరణించిన వారిని గుర్తించాల్సి ఉందని, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.ఇక ఈ ప్రమాదంపై హైతీ ప్రధాని హెన్రీ దిగ్భాంతిని వ్యక్తం చేశారు.
ప్రమాదాలను నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ నివారించలేకపోతున్నారు. హైతీలో ఇటీవల కాలంలో ఈ తరహా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.హైతీ పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదం జరిగిన వెంటనే సహాకయ బృందాలు చర్యలు మొదలుపెట్టాయి.మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







