ఫైజర్ పిల్ తో ఒమిక్రాన్ నుంచి 90 శాతం రక్షణ
- December 15, 2021
కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి ఫైజర్ పిల్ ద్వారా 90 శాతం రక్షణ ఉంటుందని ఫైజర్ కంపెనీ తెలిపింది. యాంటీవైరల్ కోవిడ్ -19 పిల్ టెస్టింగ్ లో మంచి రిజల్ట్స్ వచ్చినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన వారు గానీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న కరోనా రోగుల మరణాలను నివారించడంలో ఈ పిల్ దాదాపు 90 శాతం సామర్థ్యాన్ని చూపించిందన్నారు. సుమారు 1,200 మంది వ్యక్తులపై దీన్ని టెస్టింగ్ చేసినట్లు కంపెనీ చెప్పింది. ఫలితాల ను పైజర్ పిల్ ను ప్లేసిబో తో పోల్చినప్పుడు, ఆసుపత్రిలో చేరడం లేదా మరణాలను నివారించడంలో పైజర్ పిల్ దాదాపు 89 శాతం ప్రభావవంతంగా ఉందని గుర్తించామని తెలిపింది. ట్రయల్‌లో ఫైజర్ పిల్ తీసుకున్న వారు ఎవరూ మరణించలేదని... అదే సమయంలో ప్లేసిబో తీసుకున్న వారిలో 12 మంది మరణించారని నివేదించింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







