ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు
- December 15, 2021
అబుధాబి: ముస్లిమేతర నిర్వాసితుల కుటుంబ వివాదాల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టును అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) అండర్ సెక్రటరీ యూసఫ్ సయీద్ అల్ అబ్రి ప్రారంభించారు. అబుధాబి ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముస్లిమేతర కుటుంబ వ్యవహారాలను నియంత్రించే చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూసఫ్ సయీద్ అల్ అబ్రి మాట్లాడుతూ.. ఉప ప్రధాని, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలకు అనుగుణంగా అబుదాబి న్యాయ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగమే కోర్టు ఏర్పాటు అని వివరించారు. కొత్తగా ప్రారంభించిన కోర్టులో ద్విభాషా (అరబిక్, ఇంగ్లీష్)ను అమల్లో ఉంటుందన్నారు. కోర్టు ద్వారా వర్తించే ముస్లిమేతరుల వ్యక్తిగత స్థితి చట్టం, కుటుంబ విషయాల నియంత్రణలో పౌర సూత్రాలను వర్తింపజేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిది అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







