ప్రవాసుల జీతాల పెంపు పై PAM ఆంక్షలు. మండిపడుతున్న కార్మికులు

- December 15, 2021 , by Maagulf
ప్రవాసుల జీతాల పెంపు పై PAM ఆంక్షలు. మండిపడుతున్న కార్మికులు

కువైట్: ప్రైవేట్ రంగ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల జీతాల పెంపును పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) 'అంతర్గత సర్క్యులర్' తీవ్ర విమర్శల పాలయింది. ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ కార్మికులు మండిపడుతున్నారు. అలాగే జీతాల చెల్లింపులో వివక్ష చూపుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికి 50 దీనార్‌ల కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా నిషేధిస్తూ PAM సర్క్యులర్ వివాదమైంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నాన్-గ్రాడ్యుయేట్ ప్రవాసుల నివాస పునరుద్ధరణను నిరోధించడానికి PAM జారీ చేసిన నిర్ణయాన్ని న్యాయవ్యవస్థ రద్దు చేసినప్పటికీ, ఇది చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ఉద్యోగుల జీతాలను 50 దీనార్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచాలా వద్దా అనే నిర్ణయాన్ని కంపెనీల అభీష్టానికే వదిలేయాలని కార్మికులు అంటున్నారు. కార్మికుల నైపుణ్యం మేరకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుంటాయని, ఆమేరకే చెల్లింపులు చేస్తాయంటున్నారు. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com