ఒమిక్రాన్ కేసులు మన దగ్గర లేవు-హెల్త్ మినిస్టర్
- December 15, 2021
కువైట్: కువైట్ కొత్తగా ఒమిక్రాన్ కేసులు ఏమీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రి షేక్ డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ తెలిపారు. ఐతే కరోనా కేసుల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల ఉందని ఆయన అన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యూరోప్ లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో అలర్ట్ గా ఉన్నామన్నారు. యూరోప్ నుంచి వచ్చే సంఖ్య పెరిగిందని...వారికి కరోనా టెస్ట్ చేశాకే దేశంలోకి అనుమతిస్తున్నామని అన్నారు. నిషేధిత దేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జన్యు పరీక్షకు పంపుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ మరోసారి ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







