అవసరానికి తగ్గట్టు వ్యాక్సిన్లను మార్చాలి: భారత కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్
- December 15, 2021
న్యూఢిల్లీ : కరోనా సరికొత్త రూపం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ఆందోళనల మధ్య.. కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డా.వికె పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వేరియంట్లు తమ స్వభావాన్ని మార్చుకుంటున్న నేపథ్యంలో.. ఆ మ్యూటెంట్లకు తగ్గ వ్యాక్సిన్లను భారత్ కలిగి ఉండాలని అన్నారు. కోవిడ్ వ్యాప్తి తక్కువ లేదా మధ్యస్థ స్థాయిలో ఉన్న చోటే విలక్షణ దిశలో కదులుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో టీకాలు అసమర్థవంతంగా పనిచేసే అవకాశాలు లేకపోలేదని, గత మూడు వారాల నుండి ఇటువంటి సందేహాలే తలెత్తాయని, వీటిలో కొంత నిజం ఉన్నప్పటికీ.. తుది ఫలితం తెలియదని అన్నారు. బి.1.1.529 వేరియంట్‌ను నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) గుర్తించింది. కాగా, దీన్ని అడ్డుకునేందుకు సమర్థవంతమైన వ్యాక్సిన్లను కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







