తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం..స్పందించిన ఆరోగ్యశాఖ
- December 15, 2021
హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ బాధితులను గుర్తించిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు.
ఒమిక్రాన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నదని అయన తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గడల శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటన చేశారు. ఒమిక్రాన్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా కనపడుతున్నాయని ఆయన అన్నారు. తలనొప్పి, నీరసం, జలుబు, దగ్గు వంటివి ఉంటున్నాయని వివరించారు. హైదరాబాద్‌లోని టోలీచౌకిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల యువతి ఈ నెల 12న రాష్ట్రానికి వచ్చిందని, ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిందని ఆయన వివరించారు. బాధితులను టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నాం అన్నారు. ఒమిక్రాన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం నిపుణుల వద్ద కూడా లేదని ఆయన చెప్పారు. ఇప్పుడే అది వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. మరో వ్యక్తికి ఎయిర్‌పోర్టులో పాజిటివ్ గా తేలిందని, ఆ వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందన వ్యక్తి అని, అతను రాష్ట్రంలోకి ప్రవేశంచాలేదని శ్రీనివాసరావు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునే ఆయుధం మాస్క్ మాత్రమే అని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ వేసుకున్నా.. అప్రమత్తత అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. అప్పుడే ఒమిక్రాన్‌ను అడ్డుకోవచ్చు అని తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్‌లో స్థానికులకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మొద్దు. ఆ వార్తలు వైరస్ కంటే ప్రమాదకరం. అప్రమత్తతో, జాగ్రత్తతో ఉండాల్సిన సమయమిది. తలనొప్పి, ఒళ్లు నొప్పితో పాటు నీరసం, దగ్గు, జలుబు రావడం ఒమిక్రాన్ లక్షణాలు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పం.. కానీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో మాస్కును తప్పనిసరిగా ధరించడం అలవాటు చేసుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూనే.. వంద శాతం మాస్కు ధరించాలి అని విజ్ఞప్తి చేశారు.
కరోనా టెస్టుల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. వేలాదిగా హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేశామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తతో ఉందని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







