అబుధాబికి వచ్చే వారికి కొత్త టెక్నాలజీతో ఒమిక్రాన్ టెస్ట్
- December 15, 2021
అబుధాబి: కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అబుధాబి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది.ఇతర ఎమిరేట్ల నుంచి అబుధాబి వచ్చే వారికి ఇకపై EDE స్కానర్‌లతో చెక్ చేయనున్నారు.ఈ నిబంధనలు డిసెంబర్ 19 (ఆదివారం) నుంచి అమల్లోకి రానున్నాయని EDE స్కానర్‌ల టెక్నాలజీతో వ్యక్తులను ఆపకుండానే పాజిటివ్ కేసులను గుర్తించేందుకు వీలవుతుందని అధికారులు చెప్పారు. స్కానింగ్ లో పాజిటివ్ వచ్చిన వారికి 20 నిమిషాల్లో ఫలితం తేలే యాంటిజెన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ పాజిటివ్ వస్తే వారి శాంపిళ్లను ఒమిక్రాన్ ను గుర్తించేందుకు వీలుగా జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపనున్నారు. అబుధాబిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రేటు 0.05 శాతంగా ఉంది. నిరంతర పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఈవెంట్‌లలో గ్రీన్ పాస్ సిస్టమ్ వినియోగం, అధిక వ్యాక్సిన్ రేట్ వంటి నివారణ, ముందు జాగ్రత్త చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు వెల్లడించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







