లండన్ ను వణికిస్తోన్న ఒమిక్రాన్..అత్యధికంగా రోజువారీ కేసులు నమోదు
- December 16, 2021
లండన్: కరోనా మహమ్మారి గ్రేట్ బ్రిటన్ ను ఓ రేంజ్ లో వణికిస్తోంది. గత 24గంటల్లో 78,610 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇవే ఇప్పటివరకు దేశంలో అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య.
కరోనా వైరస్ .. డెల్టా వేరియంట్‌తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ లో ఇంత భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. జనవరి 8న నమోదైన 68,053 కేసులో ఇప్పటి వరకూ అత్యధికం. రోజుకో రకంగా వైరస్ మార్పు తీసుకోవడంతో అక్కడ ప్రభుత్వం త్వరితగతిన టీకాలు వేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ రోజురోజుకి ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. రెండు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదు కానున్నాయని హెచ్చరించారు. అయితే కోవిడ్-19 బూస్టర్ డోస్ పనిచేస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓమిక్రాన్ ముప్పును నివారించడానికి ఈ ఏడాది చివరి నాటికి వృద్ధులకు బూస్టర్ డోస్ ఇవ్వాలని జాన్సన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి:
ఒమిక్రాన్ వేరియంట్‌ల సంఖ్య ప్రతి రెండు మూడు రోజులకు రెట్టింపు అవుతోందని UK ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. మరోవైపు, బుధవారం నుండి దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన సొంత పార్టీ నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇంగ్లండ్‌లో ఇప్పుడు నైట్‌క్లబ్‌లు, స్పోర్టింగ్ మ్యాచ్‌ల సహా ఇతర ఈవెంట్స్ కు హాజరు కావాలంటే.. డబుల్ వ్యాక్సినేషన్ వేసుకున్న ‘కోవిడ్ పాస్’ అని పిలవబడే సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది.
ఎంపీలు వ్యతిరేకంగా ఓటు:
99 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. మంగళవారం రాత్రి పార్లమెంటు కరోనా సరికొత్త నిబంధనలను ఆమోదించింది. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనలకు మద్దతిస్తామని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటికే చెప్పింది. బుధవారం నుండి అటువంటి ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి టీకా సర్టిఫికేట్ లేదా గత 48 గంటల్లో RT PCR తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్‌లైన్స్‌తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









