ముదురుతున్న వివాదం...కోహ్లి పై కపిల్‌దేవ్ సంచలన వాఖ్యలు
- December 16, 2021
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. బీసీసీఐపై చేసిన వాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కోహ్లి బీసీసీఐపై సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారని కోహ్లి ఆరోపించాడు. అదే విధంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తనకు ఎవరూ చెప్పలేదు అని కోహ్లి తెలిపాడు. అయితే కోహ్లి చేసిన వాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. ఛీప్ సెలెక్టర్ చేతన్ శర్మ.. కోహ్లితో కెప్టెన్సీ గురించి ముందుగానే చర్చించాడని బీసీసీఐ పేర్కొంది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కాగా ఈ వివాదంపై లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. జట్టు కెప్టెన్సీని నిర్ణయించే హక్కు సెలెక్టర్లకు ఉంటుంది అని అతడు అభిప్రాయపడ్డాడు.
"సెలెక్టర్లు విరాట్ కోహ్లి ఆడినంతగా క్రికెట్ ఆడకపోవచ్చు, కానీ సారథ్య బాధ్యతల గురించి నిర్ణయించే హక్కు వారికి ఉంటుంది. వారు తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం విరాట్ కోహ్లికే కాదు ప్రతీ ఒక్క ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్టు కెప్టెన్సీపై ప్రభావం చూపదని నేను ఆశిస్తున్నాను. విరాట్ ఇప్పుడు కెప్టెన్సీ వివాదాన్ని విడిచిపెట్టి దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెడతాడని నేను భావిస్తున్నాను'' అని ఆయన పేర్కొన్నాడు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!