మహిళల కనీస వివాహ వయస్సు పెంపు ప్రతిపాదనకు ఆమోదం
- December 16, 2021
న్యూఢిల్లీ : మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 ఏళ్లకు పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
బుధవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన సమీక్షలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంవత్సరం తర్వాత ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బుధవారం గత ఏడాది స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన మోడీ.. ఈ ప్రతిపాదన గురించి ప్రస్తావించారు.
' మా ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణులు ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందుతోంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న కుమార్తెలను రక్షించేందుకు.. వారికి సరైన సమయంలో వివాహం చేయడం అవసరం భావిస్తున్నాం' అని మోడీ అన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
నీతి ఆయోగ్‌లో జయ జైట్లీ నేతఅత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ విధమైన సవరణలను కేంద్రం తీసుకురానుంది. గతేడాది జూన్‌లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ.. ఆరు నెలల్లోనే నివేదిక సమర్పించింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ కీలక సూచన చేసింది. ఈ మేరకు ఓ నివేదికను నీతి అయోగ్ కేంద్రానికి అందించగా.. దీన్ని పరిశీలించిన మంత్రి వర్గం.. ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!