'పుష్ప' సినిమా 5వ షో కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

- December 16, 2021 , by Maagulf
\'పుష్ప\' సినిమా 5వ షో కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

హైదరాబాద్: ఐకాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది కేసీఆర్ ప్ర‌భుత్వం. బ‌న్నీ న‌టించిన‌.. పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.రేపు పుష్ప సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబ‌ర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల‌ 30 వ తేదీ వ‌ర‌కు అంటే.. దాదాపు రెండు వారాల పాటు… పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

ఈ మేర‌కు అధికారిక జీవో ను జారీ చేసింది కేసీఆర్ ప్ర‌భుత్వం. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో… ఈ మూవీ నిర్మాణ సంస్థ‌కు భారీగానే లాభాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది. ఇక కేసీఆర్ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యం తో.. బ‌న్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏపీలోనూ ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంటే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. రేపు వ‌రల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లో పుష్ప సినిమా విడుద‌ల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com