'సంచారి' పాట విడుదల

- December 16, 2021 , by Maagulf
\'సంచారి\' పాట విడుదల

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రం నుండి సంచారీ సాంగ్‌ విడుదలైంది. కొత్త నేలపై గాలి సంతకం.. కొండ గాలితో శ్వాస పంపకం అనే లిరిక్స్‌తో సాగుతున్న ఈ సాంగ్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్‌ లుక్స్‌ ఆకట్టుకున్నాయి. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ పాటను అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించారు. కఅష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. ఈ ప్రేమకథ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com