తెలంగాణ: 9కి చేరిన ఒమైక్రాన్ కేసులు
- December 17, 2021
హైదరాబాద్: తెలంగాణలో 9కి ఒమైక్రాన్ కేసులు చేరాయి. గురువారం నమోదైన 4 కేసుల్లో ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. కెన్యా నుంచి వచ్చిన వ్యక్తి(44)గా గుర్తించారు. వ్యక్తి అడ్రస్‌లో క్లారిటీ లేకపోవడంతో ఆచూకీ దొరకలేదు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఒమైక్రాన్ హాట్‌స్పాట్‌గా పారమౌంట్ కాలనీ గుర్తించారు. పారమౌంట్ కాలనీని వైద్య సిబ్బంది జల్లడ పడుతోంది. మెడికల్ టూరిజం ద్వారా ఇతన్ని గుర్తించేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు.
కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు, ఒకరు పురుషుడు. వీరు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ర్యాండమ్ టెస్టులో భాగంగా విమానాశ్రయంలో నమూనా తీసుకుని పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. జన్యు విశ్లేషణలో ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు నాలుగు రోజుల నుంచి బయట తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో వేర్వేరు హోటళ్లలో బస చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒమైక్రాన్ పాజిటివ్‌గా తేలిన తొలి ఇద్దరు వ్యక్తులు (విదేశీయులు) హైదరాబాద్ టోలిచౌకీ, పారామౌంట్ కాలనీ, ఐఏఎస్ కాలనీల్లో తిరిగిన నేపథ్యంలో వీటిని గురువారం జీహెచ్‌ఎంసీ కట్టడి ప్రాంతాలుగా ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు 25 బృందాలుగా ఏర్పడి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







