బహ్రెయిన్ నేషనల్ డే సెలబ్రేషన్స్ సక్సెస్ అయ్యాయి.. థాంక్స్

- December 18, 2021 , by Maagulf
బహ్రెయిన్ నేషనల్ డే సెలబ్రేషన్స్ సక్సెస్ అయ్యాయి.. థాంక్స్

బహ్రెయిన్: దేశ వ్యాప్తంగా నేషనల్ డే సెలబ్రేషన్స్ సక్సెస్ అయ్యాయని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అంటూ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరఫున రాయల్ కోర్ట్ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ దినోత్సవాల సందర్భంగా కింగ్ అల్ ఖలీఫాకు అభినందనలు తెలిపిన వారందరికి రాజ కుటుంబం తరఫున అత్యంత కృతజ్ఞతలు తెలియజేశారు. 1783లో అహ్మద్ అల్ ఫతేచే స్థాపించబడిన అరబ్, ముస్లిం రాజ్యంగా ఆధునిక బహ్రెయిన్ ఎదిగిందని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా వేడుకల్లో పాల్గొన్న అధికారులు,  రాజ్యాంగ సంస్థల అధ్యక్షులు, వివిధ దేశాల దౌత్య సిబ్బంది, మునిసిపల్ కౌన్సిల్‌ల అధిపతులు, ప్రైవేట్ రంగ సంస్థలు లకు కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com