కువైట్ ను వేధిస్తోన్న డొమెస్టిక్ లేబర్ కొరత
- December 18, 2021
కువైట్: డొమెస్టిక్ లేబర్ కొరత కువైట్ ను తీవ్రంగా వేధిస్తోంది. స్థానిక మార్కెట్‌లో డొమెస్టిక్ లేబర్ కొరత తీవ్రంగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ అల్-అలీ అన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్రస్తుతం దేశీయులను రిక్రూట్ చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయన్నారు. డొమెస్టిక్ లేబర్ కొరతను అధిగమించేందుకు ఆఫ్రికన్ దేశాలతో చర్చలు జరుగుతున్నాయని, అవగాహన ఒప్పందాలపై సంతకం చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నట్లు అల్-అలీ చెప్పారు. ముఖ్యంగా కార్మిక ఎగుమతి దేశాలు ఆంక్షలు విధించినందున, కార్మికులు కువైట్‌కు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అల్-అలీ అన్నారు. కెన్యా, ఇథియోపియా తో లేబర్ రిక్రూట్‌మెంట్ కోసం అత్యవసర చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే లేబర్ సమస్య తీరుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







