నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- December 18, 2021
విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని మేరకు డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. వలస అంటే బతుకుదెరువు కోసం, లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు‘గా భావించవచ్చు. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వలస వెళ్లేలా ‘నెట్టివేయబడే’ పరిస్థితులు కొన్నైతే, వున్నచోట పరిస్థితులు అనుకూలంగా లేక మరొక చోట ‘ఆకర్షణీయంగా’ ఉండడం మరొక కారణం.
పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వలస వెళ్లడాన్ని ‘అంతర్గత వలసలు’ అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని ‘అంతర్జాతీయ వలసలు’ అంటారు. ప్రవాసులకు రాయితీలు కల్పిస్తూ వారిని ప్రాత్సహిస్తే అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో 3 కోట్లమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని అంచనా. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది.
ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. పొట్టకూటి కోసం వెళ్లిన వలస కార్మికులకు అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు అండగా ఉండాలి. తమ ఉనికిని కాపాడుకుంటూ, మాతృదేశంపై మమకారం చూపుతూ మరెందరికో సహకారాన్ని అందిస్తున్న, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనే మాటను నిజం చేయాల్సిన బాధ్యత కూడా ప్రవాసుల మీదవుంది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







