ఒమిక్రాన్ డేంజర్ బెల్స్...62 వేలు పైగా కేసులు
- December 20, 2021
ప్రపంచ దేశాలు గత 2 సంవత్సరాలుగా కరోనా మహామ్మారితో పోరాడుతూనే ఉన్నాయి.కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలు ఎత్తి ప్రజలపై విరుచుకుపడుతోంది.మొన్నటి వరకు అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైతం డెల్టా వేరియంట్‌ను తట్టుకోలేక విలవిలలాడిపోయాయి.అయితే ఇప్పుడు గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది.అంతేకాకండా ఆయా దేశాల ప్రజలపై దాని ప్రభావాన్ని చూపుడంతో భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 వేలు దాటడంతో మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.యూకేలో ఒక్కరోజే 10 వేల ఒమిక్రాన్ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం.అంతేకాకుండా యూకేలోనే ఒమిక్రాన్ మరణాలు సంభవించడం ఆ దేశ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ప్రస్తుతం యూకేలో 37,101 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 15,452, నార్వేలో 2,060, భారత్‌లో 152 తో పాటు ఒమిక్రాన్ పుట్టిన దేశమైన సౌతాఫ్రికాలో 1,247 కేసులు నమోదయ్యాయి.ఇప్పటికే పలు దేశాలు హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించాయి.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







