అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్ఆర్ఐ కొడుకు దుర్మరణం..
- December 21, 2021
అమెరికా: అమెరికాలో మద్యం మత్తులో కారు నడిపిన ఓ మహిళ ఎఆర్ఐ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. లాస్ఏంజెల్స్లో జరిగిన ఈ ప్రమాదంలో ఎన్ఆర్ఐ కొడుకు మృతిచెందగా, కూతురు మృత్యువుతో పోరాడుతుంది. ఎన్ఆర్ఐ దంపతులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడేనికి చెందిన ఎన్నారై కొడుకు మృతిచెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. బండ్లగూడేనికి చెందిన ఎన్నారై చెట్టుపెల్లి రాంచంద్రారెడ్డి ఉద్యోగరీత్యా కుటుంబంతో లాస్ఏంజిల్స్లో నివసిస్తున్నారు. రాంచంద్రారెడ్డి పదహారేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.
ఆదివారం రాత్రి తన స్నేహితుడి జన్మదిన వేడుకలకు భార్య రజనీరెడ్డి, పిల్లలతో కలిసి కారులో వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తూ లాస్ఏంజిల్స్లోని ఓ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును ఆపారు. ఈ క్రమంలో ఓ మహిళ మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ.. వారి కారును అతివేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనుక సీట్లో కూర్చున్న కుమారుడు అర్జిత్రెడ్డి (13) దుర్మరణం చెందగా.. రామచంద్రారెడ్డి, రజనీరెడ్డి, అక్షితారెడ్డి (15) చికిత్స పొందుతున్నారని బంధువులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే బండ్లగూడెం గ్రామంలో విషాదం అలుముకుంది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







