కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
- December 23, 2021
పంజాబ్‌లో భారీ పేలుడు సంభవించింది. లూథియానాలోని ఓ కోర్టు కాంప్లెక్స్‌లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లో రెండో అంతస్తులో ఉన్న బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12.22 గంటల నిమిషాలకు ఈ ఘటన జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అది శక్తివంతమైన బాంబు కావచ్చని, ఆ పేలుడు ధాటికి బాత్‌రూమ్ గోడలు బద్ధలయ్యాయని ప్రత్యక్ష సాక్షలు పేర్కొన్నారు. పక్క గదుల్లో ఉండే కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాంబు పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







